• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

పురాణ కధ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

దధీచి గొప్పతనం

ఆధ్యాత్మిక చింతనకే కాకుండా త్యాగానికి, దాతృత్వానికి పెట్టింది పేరు దధీచి. ఈ మహర్షి తండ్రి అధర్వణుడు మహా మేధో సంపన్నుడు. తల్లి శాంతి ఎంతో సాత్వికురాలు. దధీచి అసలు పేరు దధ్యాంగ్. సంస్కృతంలో దధి అంటే పెరుగు (curd). పెరుగులో మంచి పోషకాలు, కాల్షియం ఉంటాయి. పెరుగులో ఉన్న పోషకాలతో శరీర అంగములు ఏర్పడిన వ్యక్తి అని ఈ పేరుకు అర్ధం. దధ్యాంగ్ అనే పదం కొంత కాలానికి రూపాంతరం చెంది దధీచిగా మారింది. దధీచి జ్ఞాపకార్ధంగానే మన దేశంలో అత్యున్నతమైన ''పరమ వీర చక్ర'', ''వజ్ర'' పురస్కారాల ప్రదానం జరుగుతోంది. భాగవతం, ఇంకా అనేక పురాణాల్లో దధీచి ప్రస్తావన వస్తుంది.

ఒకసారి దేవతలు తమ తమ ఆయుధాలను దధీచి దగ్గర దాచుకున్నారు. ఎన్నాళ్ళకీ వాటిని తిరిగి తీసుకోలేదు. మరీ కాలం గడిస్తే ఆయుధాల మహిమ తగ్గిపోతుందని గ్రహించిన దధీచి, వాటిని మంత్ర జలంతో కరిగించి, తాగేశాడు.

దధీచి ఆయుధాలను కరిగించి, తాగిన కొంతకాలానికి, దేవతలు వచ్చి, తమ ఆయుధాలను ఇవ్వమని అడిగారు. దధీచి జరిగిన సంగతి చెప్పాడు. అది విని దేవతలు బాధపడి, తిరిగి వెళ్లారు.

ఇదిలా ఉండగా, దైవాంశ సంభూతుడైన త్వష్ట్రుడికి, రాక్షస అంశ గల స్త్రీతో విశ్వరూపుడు జన్మించాడు. విశ్వరూపుడు రాక్షసులకు రహస్యంగా నైవేద్యం సమర్పించేవాడు. ఈ విషయం తెలిసిన దేవేంద్రుడు కోపంతో దహించుకుపోయాడు. దేవతలకు విరోధులైన రాక్షసులను మెప్పిస్తున్నాడనే ఆవేశంతో విశ్వరూపుని తల నరికేశాడు.

పుత్రుని మరణవార్త విని తట్టుకోలేక, త్వష్ట్రుడు ఘోర తపస్సు చేశాడు. కొన్నాళ్ళకు త్వష్ట్రునికి మహా బలవంతుడైన వృతాసురుడు జన్మించాడు. ఇతను విశ్వరూపుని మించిపోయాడు. వృతాసురుడు రాక్షసంగా ప్రవర్తిస్తూ దేవతలను విసిగించి, వేధించసాగాడు.

దేవేంద్రునికి మరోసారి హృదయం రగిలిపోయింది. కానీ తమాయించుకున్నాడు. మునుపటిలా ఆవేశపడకుండా, శ్రీమహావిష్ణువు దగ్గరికెళ్ళి సంగతి చెప్పి బాధపడ్డాడు.

అంతా విన్న విష్ణుమూర్తి, “దేవేంద్రా, నేను చెప్పేది జాగ్రత్తగా విను...సరస్వతీ నదీ తీరంలో ఒక అందమైన ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో గొప్ప తపశ్శక్తివంతుడైన దధీచి అనే మహర్షి ఉన్నాడు. మహిమాన్వితమైన దేవతల ఆయుధాలు దధీచి వెన్నెముకలో ఉన్నాయి. దధీచి గనుక తన వెన్నెముకను దానం చేస్తే, విశ్వకర్మ ఆ వెన్నెముకను ఉపయోగించి అద్భుత శక్తిగల ఆయుధాలను రూపొందించగలడు. అందులో ''వజ్రాయుధం'' మరీ మరీ శ్రేష్ఠమైంది. వృతాసురుడు మహా బలవంతుడు గనుక అతన్ని వజ్రాయుధమే సంహరించగలదు..” అంటూ సంక్షిప్తంగా కర్తవ్యం బోధించాడు.

దేవేంద్రుడు వెంటనే దధీచి ఆశ్రమానికి బయల్దేరాడు. విష్ణుమూర్తి మాటలన్నీ దధీచికి వినిపించాడు. అంతా చెప్పి, చివరికి "మహర్షీ! వెన్నెముక లేనిదే శరీరం నిలబడదు. అంత కీలకమైన వెన్నెముకను అడిగి, ప్రాణత్యాగం చేయమనడం ఎంత మహా పాపమో నాకు తెలుసు. నన్ను క్షమించండి..” అన్నాడు దేవేంద్రుడు.

ఆ మాటలకు దధీచి చిరునవ్వు నవ్వి "దేవేంద్రా, 'జాతస్య మరణం ధ్రువం..' అన్నారు. చావు ఎప్పటికైనా తప్పదు. ఈ శరీరం ఎన్నటికీ శాశ్వతం కాదు. అలాంటప్పుడు నా శరీరం ఒక మహా కార్యానికి ఉపయోగపడితే అంతకంటే కావలసింది ఏముంది? నా వెన్నెముకను నిరభ్యంతరంగా ఇస్తాను. దాంతో వజ్రాయుధం రూపొందించి, లోక కంటకుడైన వృతాసురుని సంహరించడానికి వినియోగిస్తే అంతకంటే అదృష్టం ఇంకేముంది? నా జన్మ ధన్యమైనట్లు భావిస్తాను..” అన్నాడు.

అదీ దధీచి గొప్పతనం. దేవేంద్రుడు అడిగింది సామాన్యమైన కోరిక కాదు. ప్రాణత్యాగం చేయమని కోరాడు. అయినా దధీచి కోపం తెచ్చుకోలేదు. ఎంతమాత్రం సందేహించలేదు. పైగా సంతోషంగా ఒప్పుకుని కోరిక తీర్చాడు.

దధీచి తన తపోదీక్షతో, శరీరాన్ని శుష్కింపచేసుకుని, వెన్నెముకను దేవేంద్రునికి మిగిల్చాడు.

దధీచి వెన్నెముకతో వజ్రాయుధం తయారైంది. ఇతర శక్తివంతమైన ఆయుధాలు కూడా వచ్చాయి. యుద్దంలో వృతాసురుడు దేవతలతో కలబడ్డాడు. విపరీతమైన బలాధిక్యుడైన వృతాసురుడు దేవేంద్రుని ఏకంగా మింగేశాడు. ఇంద్రుడు, దధీచి వెన్నెముకతో తయారైన వజ్రాయుధంతో వృతాసురుని ఉదరం చీల్చుకుని బయటకు వచ్చాడు. అలా వృతాసురుడు మరణించాడు, దధీచి త్యాగశీలత శాశ్వతంగా నిలిచిపోయింది.

ఇంకా చదవండి »

ఆంజనేయుడు హనుమ అయిన కధ



 ఆంజనేయుడు పెరిగి పెద్ద వాడవుతున్నాడు .ఒక రోజు ఆకలి గా వుందని అమ్మను అడిగాడు ఏమైనా పెట్టమని .ఆమె పండిన పళ్ళు చెట్టుకు వుంటాయి కోసుకొని తినమన్నది .అప్పుడే సూర్యోదయం అవుతోంది అరుణ కాంతితో సుర్యుడు ఉ౦డటం వల్ల పండు గా భావించి ఆకాశానికి యెగిరి సూర్యున్నిపట్టు కొన్నాడు . .ఆరోజు సూర్య గ్రహణం రాహువు సూర్యుని కబళి౦చాలి .తాను చేయాల్సిన పని ఇతను చేయటం చూసి కోపం వచ్చింది . నేరేడు పండు లాగా నల్ల గా వున్న రాహువుని చూసి పండు అనుకోని పట్టుకో బోయాడు .అతను పారిపోయి ఇంద్రుడికి చెప్పాడు .తెల్లని ఐరావతం ఎక్కి ఆయన వచ్చాడు .దాన్ని కబళించాలని మీదకు దూకాడు. ఇంద్రునికి, ఆశ్చర్యము ,కోపమూ వచ్చి వజ్రాయుధాన్ని ముందుగా తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు .నోటిలో సూర్య బింబాన్ని వుంచుకొనే ఆంజనేయుడు ఆ రెండిటినీ రెండు వెంట్రుకలతో ఎదుర్కొని వాటిని పనికి రాకుండా చేశాడు .దేవతలంతా వచ్చి సూర్యుడు లేక పొతే ప్రపంచానికి చాల నష్టమని ,యజ్ఞాది క్రతువులు చేయటం కుదరదని అతనికి నచ్చ చెప్పారు .వాళ్ల మాట విని తాను నోటితో మింగిన సూర్యున్ని వదిలేశాడు . 

ఇంద్రునికి కలిగిన పరాభవం మర్చి పోలేక ,ఆన్జనేయుడు ఏమరు పాటులో వుండగా మళ్ళీ వజ్రాయుధం విసిరాడు .అది అతని దవుడ కు తగిలి నెత్తురు గడ్డ కట్టి స్పృహ కోల్పోయాడు .వాయువుకు ఈ విషయం తెలిసి వీచటం మానేశాడు .ప్రపంచం గాలి లేక స్తంభించి పోయింది .మళ్ళీ దేవతలందరూ వచ్చారు బ్రహ్మ తన కమండలం లోని నీళ్ళను బాలుని పై చల్లి మూర్చనుంచి మరల్చాడు .దేవతలందరినీ అన్జనేయునికి వరాలు ఇవ్వమని బ్రహ్మ ఆదేశించాడు .దీర్ఘాయువు ,బలం ,పరాక్రమం ,ఆరోగ్యం తేజస్సు ,గుణం ,బుద్ధి ,విద్య ,విచక్షణ ,ప్రసన్నత ,చతురత ,వైరాగ్యం ,విష్ణు భక్తి ,దయ పర స్త్రీ విముఖత ఏ అస్త్రము ఏమీ చేయలేని శక్తిని దేవతలందరూ ఆన్జనేయునికి వరం గా అనుగ్రహించారు .వజ్రాయుధం చేత మరణం ఉండదని ,బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయలేదని అయితె దానికి కొద్ది సేపు లొంగి పోవాల్సిన పరిస్థితి వస్తుందనిఅన్నారు. వజ్రాయుధం తగిలినా ఊడి పోకుండా అతని దవడ ఆంటే హనుమ వుంది కనుక అప్పటినుంచి ఆన్జనేయునికి హనుమ అనే పేరు సార్ధకం అవుతుందని చెప్పారు . 

విష్ణు మూర్తి లాగ దేవతలను వుద్దరిస్తాడని ,రామ కార్యం నేరవేరుస్తాడని ,శివునిలా దుష్ట సంహారం చేస్తాడని ,లంక లోని రాక్షసులను వదిస్తాడని ,త్రిమూర్తుల అవతారం కనుక త్రిమూర్త్యాత్మకుడనే పేరు తో పిలువ బడ తాడని ,,దుష్ట గ్రహాలను పారదోల టానికి ప్రతి గ్రామం లో ఆంజనేయ దేవాలయాలు నెలకొల్పుతారని బ్రహ్మ అనుగ్రహించి అంతర్ధానమయాడు. వాయువు మళ్ళీ వీచి సకల ప్రాణి కోటికి ప్రాణ వాయువును అందించాడు .ఇలా ఆంజనేయుడు హనుమ గా మారాడు .  

దేవతలిచ్చిన వరాలతో హనుమ విజ్రుమ్భించి సహజ మైన కోతి చేష్టలు చేస్తూ ,అందర్నీ బాధిస్తుందే వాడు .అతను భవిష్యత్ లో చేయ బోయే గొప్ప కార్యక్రమాల గురించి తెలిసిన మునులు ఏమీ అనకుండా వుండే వారు .వాళ్ల గోచీలు లాగటం, మడి బట్టలు చిమ్పేయటం చూసి ఒక శక్తి సంపన్నుడైన మహర్షి ”నీ సహజ శక్తిని మర్చిపోతావు ”అని శపించాడు తర్వాత జాలిపడి ఎవరైనా గుర్తు చేస్తే మళ్ళీ శక్తి సంపన్నుదవుతాడని అనుగ్రహించాడు .క్రమంగా అల్లరి తగ్గి మంచి బాలుడనిపించుకున్నాడు . 

విద్య నేర్చే వయసు వచ్చింది .తల్లి అంజన సూర్యుని అనుగ్రహం పొంది విద్యలు నేర్చుకోమని పంపింది .ఆయన దగ్గరకు వెళ్లి విద్య నేర్పని అడిగాడు .తాను అనుక్షణం తిరుగుతూంటాను కనుక విద్య నేర్పలేను అన్నాడు .తాను కూడా సూర్యుని తో పాటు కదిలి పోతూ ,విద్యలు నేర్చాడుఒక కాలు ఉదయపర్వతం మీద ,రెండోది పశ్చిమ పర్వతం మీద వుంచి శ్రద్ధ తో విద్య నేర్చాడు .అయిదు వ్యాకరణాలు నేర్పాడు .మిగిలిన నాలుగు నేర్పటానికి వివాహం జరగాలి కనుక తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకో మన్నాడు .చేసుకుంటాను కాని నేను బ్రహ్మ చారి గానే వుంటాను దా౦పత్య సుఖం వుండదు .దానికి మీ అమ్మాయి అంగీకరిస్తే నేను సిద్ధం అన్నాడు .ఆమె అంగీకారం తో వివాహం జరిపి మిగిలిన నాలుగు వ్యాకరణాలు నేర్పి నవ వ్యాకరణ పండితుణ్ణి చేశాడు .వీరి కన్యాదానం జ్యేష్ట శుద్ధ దశమి నాడు జరిగింది .సువర్చల తపోనిష్ట తో గడుపు తోంది. గంధ మాదన పర్వతం మీద .హనుమ తల్లి దగ్గరకు వెళ్లి విషయం అంతా చెప్పాడు .ఆమె సంతోషించి ”నాయనా !నాకు వాలి ,సుగ్రీవుడు అనే సోదరులున్నారు .నీకు వాళ్ళు మేన మామలు .వారిద్దరికీ బద్ధ వైరం .అందులో సుగ్రీవుడు ధర్మ స్వరూపుడు నువ్వు సుగ్రీవుని చేరి అతనికి రక్షకుడు గా వుండు .నీ పెద్ద మేన మామ వాలితో విరోధం మాత్రం పెట్టుకోకు .నీకు శుభం జరుగుతుంది ”అనిదీవించి పంపింది . 

తల్లి మాట విని హనుమ పంపానదీ తీరం లో వున్న చేరి మంత్రి అయాడు .తర్వాత రామ సుగ్రీవులకు సఖ్యత కూర్చిసీతాన్వేషణ కోసం సముద్రం దాటి సీతా , జాడను లంకలో తెలుసు కోని ,రాముని ముద్రికను ఆమెకిచ్చి ,ఆమె ఇచ్చిన శిరోమణి తీసుకున్నాడు అక్షుడు మొదలైన రాక్షసులను చంపి ఇ౦ద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రానికి బంధితుడై రావణుడి దర్బార్ కు వెళ్లి హిత వచనాలు చెపాడు .వినక తోకకు నిప్పంటిస్తే దానితో లంకా దహనం చేసి ,మళ్ళీసీతా దేవిని దర్శించి, సముద్రం దాటి రామసుగ్రీవులను విషయం చెప్పాడు .రాముడిసైన్యం సముద్రుని పై వారధి నిర్మించి లంకను చేరింది. రామ రావణ యుద్ధం లో చాల మంది రాక్షసులను చంపాడు హనుమ .రావణున్ని రాముడు సంహరించాడు .సంజీవి పర్వతం తెచ్చి లక్ష్మణ మూర్చను తొలగించాడు .మైరావణ సంహారం చేసి శ్రీ రామ పట్టాభిషేకం జరిపించి ,సేవా తత్పరుడై ,రామ కార్య దురంధరుడై ,త్రేతా యుగం తర్వాత గంధ మాదన పర్వతం చేరి తారక నామం జపిస్తూ ,దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ,భక్తుల మనో భీస్టాన్ని నెర వేరుస్తూ రామ భక్త హనుమాన్ గా ప్రజల హృదయం లో చిరస్థాయి గా వున్నాడు భక్త వరదుడైన శ్రీ హనుమ.

ఇంకా చదవండి »

శివ సంకల్పమస్తు



(అసురుడైనా మయుడు శివుని అడిగిన వరములు బహుశా మానవమాత్రులు కూడా అడగలేరేమో)

నీ పాద కమల సేవయు....
శివమహాపురాణము - 12 వ అధ్యాయము - మయ స్తుతి

మయ ఉవాచ:-
దేవ దేవ మహాదేవ భక్తవత్సల శంకర!
కల్పవృక్ష స్వరూపోసి సర్వపక్ష వివర్జితః!!
జ్యోతి రూపో నమస్తేస్తు విశ్వరూప నమోస్తుతే!
నమః పూతాత్మనే తుభ్యం పావనాయ నమో నమః!!
చిత్ర రూపాయ నిత్యాయ రూపాతీతాయ తే నమః!
దివ్యరూపాయం దివ్యాయ సుదివ్యా కృతయే నమః!!
నమః ప్రణత సర్వార్తి నాశకాయ శివాత్మనే!
కర్త్రే భర్త్రే చ సంహర్ర్తే త్రిలోకానాం నమో నమః!!
భక్తి గమ్యాయా భక్తానాం నమస్తుభ్యం కృపాలవే!
తపస్సత్ఫలదాత్రే తే శివాకాంత శివేశ్వర!!
న జానామి స్తుతిం కర్తుం స్తుతిప్రియవరేశ్వర!
ప్రసన్నోభవ సర్వేశ పాహి మాం శరణాగతమ్!!

దేవ దేవా! మహాదేవా!భక్త ప్రియా!, శుభములనే చేయు వాడా! కల్ప వృక్ష స్వరూపుడవగు నీకు స్వ, పర భేధములు లేవు. జ్యొతి స్వరూపుడవు (జ్ఙాన స్వరూపుడవు) అగు నీకు నమస్కారము. ఈ సమస్త విశ్వరూపములో ఉన్న నీకు నమస్కారము. పవిత్రమగు ఆత్మ స్వరూపుడవైన నీకు నమస్కారము. అత్యంత పావనుడవు, పాపులను కూడా పావనము చేయు నీకు నమస్కారము. చిత్రమైన రూపము కలవాడవు, నిత్యుడవు, ఏ రూపమూ లేని రూపాతీతుడవు ఐన నీకు నమస్కారము. దివ్య మైన స్వరూపము కలవాడవు, ప్రకాశ స్వరూపుడవు, గొప్పనైన దివ్య ఆకృతి కలవాడవు ఐన నీకు నమస్కారము. నమస్కరించినవారి కష్టములనన్నీ తొలగించువాడా, సర్వ మంగళ స్వరూపుడా నీకు నమస్కారము. ముల్లోకములను సృష్టించి, భరించి, లయం కావించు నీకు అనేక నమస్కారములు. భక్తిచే పొందవలసిన వాడు, భక్తులందరి గమ్యమూ, భక్తుల యెడ అపారమైన కరుణ కలవాడూ ఐన నీకు నమస్కారము. తపస్సులకు ఘనమైన ఫలములొసగు వాడు పార్వతీ మాత కు పతి, అన్ని మంగళములకు ఈశ్వరుడవు ఐన నీకు నమస్కారము. ఓ ప్రభూ! సర్వమునకూ ఈశ్వరుడవైన వాడా! నీవు స్తోత్ర ప్రియుడవు, కాని నాకు స్తోత్రము చేయుట కూడా రాదు. హే సర్వేశ్వరా! నీవు ప్రసన్నుడవై నా యందు అపార కృపతో నన్ను రక్షింపుము.

శివ ఉవాచ:-
వరం బ్రూహి ప్రసన్నోహం మయ దానవసత్తమ! మనోభిలషితం యత్తే తద్దాస్యామి న సంశయః!!

ఓ రాక్షస శ్రేష్ఠా ! మయా! నీ యందు ప్రసన్నుడనైతిని, నీ మనస్సుకు నచ్చిన వరము కోరుకొనుము, సంశయము లేకుండ ఇచ్చెదను

మయ ఉవాచ:-
దేవ దేవ మహాదేవ ప్రసన్నోయది మే భవాన్!
వరయోగ్యోస్మ్యహం చేద్ధి స్వభక్తిం దేహి శాశ్వతీమ్!!
స్వభక్తేషు సదా సఖ్యం దీనేషు చ దయాం సదా!
ఉపేక్షా మన్యజీవేషు ఖలేషు పరమేశ్వర!!
కదాపి నాసురో భావో భవేన్మమ మహేశ్వర!
నిర్భయస్స్యాం సదా నాథ మగ్నస్త్వద్భజనే శుభే!!

దేవ దేవా! మహాదేవా! నీవు నాయందు ప్రసన్నుడవతివేని, నేను వరమునకు అర్హుడైనచో, నాకు నీయంది శాశ్వత భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము. నీ భక్తులతో మైత్రిని సత్సంగమును, దీనుల యందు దయను, ఇతర ప్రాణులయందును దుష్టులయందును ఉపేక్షాభావమును కలిగించుము. హే పరమేశ్వరా! నాకు ఎన్నటికీ ఆసురీ భావములు కలుగకుండుగాక. హే మహేశా! నేను సర్వదా మంగళకరమగు నీ నామ భజనము యందే నిమగ్నుడనై భయము లేక ఉండు వరమిమ్ము.

శివ ఉవాచ:-
దానవర్షభ ధన్యస్త్వం మద్భక్తో నిర్వికారవాన్!
ప్రదత్తాస్తే వరాస్సర్వేభీప్సితాయే తవాధునా!!

రాక్షస శ్రేష్ఠా! నీవు కోరిన వరములచే నా భక్తుడవగు నీవు ధన్యుడ వైనావు. నీవు కోరిన వరములనిచ్చితిని.


ఇంకా చదవండి »

తారకాసుర వృత్తాంతం-శ్రీ శివ మహాపురాణము


"రాక్షసులకు తల్లి దితి. ఈమె కశ్యప ప్రజాపతి భార్య. ఆమె కుమారులే హిరణ్యాక్ష, హిరణ్య కశిపులు. వీరు శ్రీహరి అవతారాలైన వరాహ - నరసింహ రూపాలచే వధింపబడిన వైనం మీకు తెలిసిందే.

ఆ తదుపరి ఆమెకు శివదీక్షా మహిమవల్ల వజ్రాంగుడనే వాడు ఉదయించాడు. దైవభక్తి వల్ల ఇతడిలో సాత్త్విక గుణం అధికంగా ఉండగా, దురదృష్ట వశాన ఇతడికి భార్య అయిన వరాంగికి అంతులేని కామం - అధిక తామసం ఉండేవి.  
ఒకనాడు మహదానంద వేళ, భర్తను అమితంగా సుఖకేళి యందు సంతోషపరచి ఓ వరాన్ని భర్తనుంచి పొందిందా కాముకి. హరిని దుఃఖపెట్టగల, ముల్లోకాల్లోనూ ఎదురన్నదే లేని అమిత బలశాలి అయిన కొడుకును కనాలన్నదే ఆమె కోరిక.

బ్రహ్మకై తపస్సుచేసి వజ్రాంగుడామె కోరిక నెరవేర్చాడు. లోకాలన్నీ వాడు పట్టడంతోనే గడగడలాడి మరీ శోకించాయి. వాడే తారకుడు. తండ్రినిమించి మరీ బ్రహ్మ గురించి తపస్సు చేశాడు.

ఉగ్రమైన తపస్సుతో బ్రహ్మను మెప్పించి మెలికతో కూడిన వరాలెన్నో పొందాడు. మచ్చుకు కొన్ని చూడండి! అపారమైన -అనంతమైన శక్తి యుక్తులుండాలన్నాడు. విశ్వవిజేతను కావాలన్నాడు. శివుడి వల్ల గానీ, విష్ణువు వల్లగానీ చావకూడదన్నాడు. మళ్లీ అంతలోనే ఏం గుర్తొచ్చిందో ఏమో!

అసలు బ్రహ్మ సృష్టిలో దేనివల్ల చావు రాగూడదని కోరుకున్నాడు. ఇన్ని కోరినా అసలు సిసలు వరం... ఎక్కడో
తప్ప అసాధ్యమయ్యే వరం.. కోరడంలోనే ఉంది అసలు మెలిక. పరమ విరాగి, నిత్యతపస్వి, సతీ వియోగి అయిన పురుషుడికి ఎవరైనా కుమారుడుగా జన్మిస్తే, అతడి వల్ల మాత్రమే తనకు మరణం ఉండేలా వరం అనుగ్రహించేశాడు బ్రహ్మ. పెళ్లమేలేని వాడై - పైగా విరాగియై ఉండేవాడెక్కడైనా ఉంటాడా? భార్యవుంటే విరాగి ఎలా అవుతాడు? పైగా నిత్యతపస్వి. అంటే, భార్యవున్నా ఒకటే! లేకున్నా ఒకటే! ఇంత ఆలోచించిన తారకాసురుడు, ఆ వర గర్వంవల్ల తనకిక ఎదురులేదని భావించాకనే దేవతలను సాధించడం మొదలుపెట్టాడు. పైగా వాడు తన తాతవైన గాధలు చిన్నతనంలోనే తన నాయనమ్మ ద్వారా హత్తుకు పోయేలా చెప్పించుకు విని కసిపెంచుకున్నందువల్ల కూడా అలా తయారయ్యాడు.

ముందు వెనుకలు చూడకూండా బ్రహ్మ ఇచ్చిన వరాలతో, దేవతలకే శిరోవేదన కలిగించేవా డయ్యాడు. నాలుగు తలలున్నా, సమయానికి ఒక్క తలతో అయినా ఆలోచించకుండా వరాలిచ్చినందుకు బ్రహ్మకే తలపట్టుకోవాల్సిన స్థితి కల్పించాడు. అదీ సంగతి" అని తారకాసురుని వృత్తాంతం చెప్పాడు సూతుడు.

అనంతరం...

మునులందరి కోరికపై మళ్లీ గిరిజా శంకరుల గాథ నెత్తుకున్నాడు సూతుడు. "....కనుక, తారకుడు కోరిన రీతిన అన్ని విధాలా సరిపోగలిగిన వాడు... శివవీర్యసంజాతు డొక్కడే గనుక దేవతలకు అంత ఆతృత, ఆదుర్దా!

దేవతల ఆశీస్సులు దండిగా అందుకున్న మదనుడు "సర్వ ప్రపంచాన్నీ సమ్మోహపరచగల నేను, సాక్షాత్ శర్వుడినే చలింపచేస్తేనే కదా! నా సత్తా లోకానికి వెల్లడయ్యేది" అనే పట్టుదలతో కూడా, శివుడు తపమాచరిస్తున్న తావుకు చేరువైనాడు.

ఇంకేమున్నదీ....అకాలంలో వసంతఋతు సూచన లారంభమైనాయి. కాలం కాని కాలంలో వసంతాగమనం తపోదీక్షాపరులకు ప్రతికూలవర్తి. అశోకాది వృక్షాలు పూచాయి, మామిళ్లు విరగకాచాయి. తుమ్మెదల ఝుంకారం - కీర శుక పికాల కలకలారావం అధికమైంది.

ఈ మధుమాసపు అలజడీ - మదనుడి సందడీ దేవలోకం నుండి హిమాలయ విహారాలకొచ్చిన కిన్నెర కింపురుష గంధర్వాదులకు మదనకేళికి సమాయత్తపరిచేలా ఉండగా, మహేశ్వరుని మనస్సును అణుమాత్రము సంచలింప చేయకుండెను.

పరోక్షమున కాకుండ, ప్రత్యక్షమున తన ప్రతాపాన్ని చూపించాలనుకున్నాడు. అతడి ప్రయత్నానికి సహకరిస్తోందా అన్నట్లు పార్వతి కూడా, శివ పరిచర్యార్ధం ఆ సమీపంలోనే సంచరిస్తున్నది. మదనుడికి మంచి పట్టు దొరికినట్లయింది.

తరుణాబ్జముఖి - పర్వతరాజపుత్రి, చంద్రశేఖరుని సమీపించి అంజలి ఘటించి నిలిచింది. సరిగ్గా అదే సమయంలో శివుడు ధ్యాన నిష్ఠలోంచి కళ్లు తెరిచి తన ఎదుటనున్న పార్వతిని హసన్ముఖుడై చూశాడు.

అదే అదనుగా భావించిన మదనుడు 'హర్హణ' మనే శరాన్ని ప్రయోగించాడు - క్షణం కూడా ఆలస్యం చేయకూండా. వెంట వెంటనే 'సమ్మోహ'నాస్త్రం సంధించాడు.

ఇంకేమున్నదీ?.. ఆ లతాంతాయుధ ప్రభావంవల్ల - చంద్రోదయవేళ సముద్రం ఉప్పొంగిన రీతిన నిమేషకాలం ఈశ్వరుని చిత్తం చలించింది. కాని...

అంతలోనే శివుడు అప్రమత్తుడైనాడు. తనకు కలిగిన వికారానికి కారణం తెలియడం కోసం చుట్టూ చూశాడు. శివుడు తననే వెతుకుతున్నాడని అర్ధం అయింది మదనుడికి. తప్పించుకొని పారిపోయేలోగానే గిరీశుని దృష్టికి దొరికిపోయాడు. తక్షణం, తీక్షణమైన తన మూడో కంటిని తెరిచాడు - త్రిలోచనుడు. ఆయన మూడో కన్ను అసలే అగ్నికీలలకు ఆలవాలం కదా! ఓ మహోగ్రజ్వాల వెలువడింది. నిటలాక్షుడి నయనంలోంచి. అంతే! మన్మథుడు భగ్గున మండిపోయాడు. తిరిగి చూస్తే ఇంకే ముందక్కడ? బూడిదకుప్ప తప్ప.

ఆ మహావిషాదకర దృశ్యాన్ని చూసిన దేవ, మునులంతా హాహాకారం చేశారు. మన్మధుని రక్షించాలనే ఆత్రంతో వస్తున్నవారందరూ ఇంకా అంతదూరాన ఉండగానే, వారి కళ్ల ఎదుటే జరిగిపోయిందీ దారుణం!

హటాత్తుగా ఆవనిలో విరసిన ఆమని అంతర్ధానమైంది.

మన్మధపత్ని రతీదేవి కీవార్త క్షణాలమీద తెలిసింది. ఆమె శోకవిచలిత అయిమూర్చల్లింది. పరిచర్యలతో తిరిగిలేచి దీర్ఘశోకంలో మునిగింది. దేవతలంతా ఏకమై, తన పతిదేవుడిని బూడిదగా మిగిల్చారని పలురీతుల వాపోయింది. తన పతిలేని బ్రతుకిక వృధా అని తలచి, అగ్ని ప్రవేశానికి సిద్ధపడింది.

అంతలో ఆకాశవాణి రతీదేవి నుద్దేశించి ఇలా పలికింది.

"మన్మధసతీ! సాహసమువలదు. నీకు అతిస్వల్ప సమయములోనే శుభము జరుగనున్నది. ఏది కర్మరీత్యా జరుగనున్నదో, అది జరుగక మానదు. అంతేకాదు! నీ భర్తకు బ్రహ్మశాపము గలదు. నీ జననమునకు పూర్వమే జరిగిన, ఆ శాపగాథ నీకు తెలియకపోతే పోనిమ్ము!

గర్వాంధత చేత నీల కంఠునికే మదనతాపము పుట్టించు దుస్సాహసము నీ భర్తది. ఆ భస్మము జాగ్రత్తగా కొంగున మూట కట్టుకో! ఎప్పుడైతే పార్వతీ పశుపతుల కళ్యాణం జరుగుతుందో - ఆనాడు అంబికాదేవి కోరిక మేరకు, శివుడు కరుణాంతరంగుడై మన్మధుని తిరిగి బ్రతికించగలడు".

అశరీరవాణి చెప్పిన ఈ మాటలకి రతీదేవి కొంతూరట చెందింది. వారి కళ్యాణం ఎప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూడ సాగింది.

పార్వతీదేవికి వైనం అంతా తెలిసి, ఎంతో విచారించింది. తాను ఒక వంక భర్తకోసం తపిస్తూ వుంటే, అన్యాయంగా - తన కారణంగా తాను ఇంకోవనితను భర్తకు దూరం చేయడం జరిగిందేమిటీ...అని ఎంతో ఖేదపడింది.

ఎప్పుడైతే, మన్మధ దహనకాండ జరిగిందో, ఇక అక్కడ తాను ఉండజాలనంటూ శివుడు అంతర్హితుడయ్యాడు అక్కడనుంచి. పార్వతి పరి పరివిధాల పరితపించుచు, తన శివు నెందును కానరాక ఉంటుచుండగా, నందికేశ్వరుడు - తదితర మనీశ్వరులు ఆ పర్వతరాజపుత్రిని ఊరడించి, తిరిగి ఆమెను హిమవంతుని సన్నిధిన చేర్చి, జరిగిన సంగతంతా వివరించారు.

తన పుత్రికకు జరిగిన ఆశాభంగానికి హిమవంతుడు కూడా ఎంతో చింతించాడు. ఇంకొక ప్రక్క దుఃఖాగ్ని తప్తయైన తన కూతురును ఓదారుస్తూ "తల్లీ! ఇక మన ప్రాప్తమింతే! ఊరడిల్లు" మని చెప్పి ఒప్పించే ప్రయత్నాలు చేయసాగాడు. మేనకాదేవి భర్త ననుసరించింది.

ఇంకా చదవండి »

కౌరవుల పేర్లు


ఇంకా చదవండి »

కృష్ణకధల్లొ ఆధునీకులు తెలుసుకొవాల్సినవి ఏంటి?అందులొ ఉన్న సైన్స్ ఏంత?

దేవికి దేవి సప్తమగర్భంలొ పెరుగుతున్న పిండాన్ని వసుదేవుడు కంసుడికి భయపడి యమున ఆవలి వడ్డున ఉన్న నందవ్రజంలొ తన మరొభార్య రొహిణి దేవి గర్బంలొకి ప్రవేశపెట్టాడు.అంటే ఆ కాలంలొనేఈ దేశప్రజలకు గర్భమార్పిడి విధానం తెలుసని అర్ధమవుతొంది.

ఇక గాంధారి దృతరాషృల పిల్లలు కౌరవులు ఎలా పుట్టారు?గాంధారి కడుపులొని పిండం ముక్కలయితే ఆ
ముక్కలను చిన్న కుండల వంటి పాత్రలలొ వేసి అతి జాగ్రత్తగా వాటిని పెంచమని వ్యాసమహర్షి చెప్పారు.ఈ ప్రపంచంలొ తొలి టెస్ట్ ట్యూబ్ బేబిలు వారే కదా.కావలంటే వ్యాసులవారు రాసిన మహభారతం(సంస్కృతం) చూడండి. ఆటంబాంబు లేద అణుబాంబులనే ఆనాడు అస్త్రశస్త్రాలు గా చెప్పారు.ఆ బాణాల ప్రయొగం చేత ఎలాంటి ప్రభావాలు కలుగుతాయొ మహాభారతంలొను,ధనుర్వేదంలొను చెప్పబడ్డాయి.కావలంటే ఒక్కసారి పరిశీలించండి.

మహభారత యుద్దంలొ ఒకానొక సందర్భంలొ వరి మాటలు ఇలా సంస్కృతంలొ ఉన్నవాటిని మీకొసం ఇల అందిస్తునాము."రాత్రి కావస్తొంది.మరి చీకటిలొ యుద్దం చేయదం కష్టం కదా.చింతించాల్సిన అవసరం లేదు.మన ఏనుగుల తలలకు సూర్యకాంతిని తలపించేటువంటి పెద్ద పెద్ద కాంతిని ప్రసరించే యంత్రాలు మన దగ్గర ఉన్నాయి.వాటికి ఇంధనం వాడల్సిన అవసరం లేదు.మనం నిర్భయంగా యుద్దం చెయ్యొచ్చు"అని తాత్పర్యం.అంటే అప్పట్లొనే వైర్లెస్స్,రెమొట్లెస్స్ ఫొకస్ లైట్లు ఉన్నాయని తెలుస్తొంది.మీరు కావలంటే సంస్కృత మహభారతం చదవండి.కురుక్షేత్ర సంగ్రామంలొ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది.

భవగవద్గీత కేవలం ఒక మత గ్రంధం మాత్రమే కాదు.అది ఒక మెనెజ్మెంట్ స్కిల్ల్స్ గురించి ఎంతొ విపులంగా తెలిపె గ్రంధం.అందుకే ఐ.ఎస్.బి లాంటి పెద్ద పెద్ద సంస్థలు గీతనే భొదిస్తున్నాయి.

భారత పురావస్తూ శాఖవారి తవ్వకాల్లొ గుజరాత్ లొ కృష్ణుడు ఏలిన ద్వారక బయటపడిండి.మహభారతం,శ్రీ కృష్ణావతారం నిజమని నేటి సమాజానికి తెలియపరిచింది.

గాంధర దేశమే నేడు ఖాందహార్ గా ఆఫ్ఘనిస్తాన్లొ ఉంది అన్నది పచ్చి నిజం.నాతి ఇంద్రప్రస్థ నేటి డిల్లి. అభిమన్యుడు గర్భంలొ ఉండగానే చాలా విషయాలు తెలుసుకున్నాడు.ఇది విన్న పాశ్చాత్యులు ఒకప్పుడు నవ్వినా ఇప్పుడు అదే నిజమని పరిశొధించి చెప్తే నిజమె అని తెలుసుకొని గర్భిణీలకు ప్రత్యేక కొచింగ్ ఇస్తున్నారు.

అశ్వథామ నారయణాస్త్రం అనే ఒక నుక్లియర్ మిస్సైల్ ని ద్వారక లొ ఉన్న ఉత్తర గర్భంలొ ఉన్న అభిమన్యుడి మీద ప్రయొగిస్తే దాని దిశను మార్చి అరేబియ సముద్రంలొ దూరంగా పదెల చేశాడు.ఎందుకు అలా దాని దూరంగా మళ్ళించడం అంటే దాని రెడియెషన్ ఆ కడుపులొ ఉన్న పిండానికి హాని చేస్తుందని చెప్పాడట.

యుద్దం ఏలా చెయ్యలి,యుద్ద నాయకుడ్ని ఏ స్థానంలొ ఉంచాలి లాంటి ఏన్నొ రహస్యాలను మహభారతంలొ చెప్పారు.ఇప్పుడు వాటినే అమెరిక వారు పరిశీలిస్తున్నారన్న విషయం మనకు తెలియదు.


కొన్ని వందలమైళ్ళ దూరంలొ జరుగుతున్న మహాభారత యుద్దాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వార సంజయుడు చూసాడు,ధృతరాష్టృడు విన్నాడు.ఆ కాలంలొనే ఉపగ్రహలు ఉన్నయాని,ఒక తెర మీద వీటిని వీక్షించారని ఆధునిక శాస్త్రవేత్తలు మహాభారతాన్ని చదివి మనకు చెప్పారు.

ఇంకా చదవండి »

శాకంబరిదేవి కధ

శాకంబరిదేవి కధ చాలా రహస్యమైనది.దేవి పురాణంలొని 28వ సర్గలొ ఉన్న ఈ కధ మహా మహిమాన్వితమైనది.ఈ కధను చాల నమ్మకంతొనే వినాలని,ఎవరికి పడితే వారికి చెప్పకూడదని,అవతలి వాళ్ళ శ్రద్దను గమనించి మాత్రమే చెప్పాలని నియమం.

శాకంబరి అనగా శాకములను ధరించినది/కలిగినది అని.శాకములు అంటే కూరగాయలు.అలాగే శాకములకు
ప్రాణశక్తిని ఇచ్చేది,శాకములకు మూలమైనది అని.బరి అనగా వేరు అని.శాకంబరి అనగా పచ్చదనానికి ప్రతీక.పచ్చటి ప్రకృతి ఆమె యొక్క సాకార రూపం.

ఈ కధ వేదవ్యాస మహర్షిచే చెప్పబడింది.వేదవ్యాస మహర్షి విష్నుస్వరూపం.చిరంజీవి.ఇప్పటికి బద్రి(ఒకనాటి బదరికాశ్రమం)లొ సశరీరంతొ ఉన్నారు,పుణ్యాత్ములకు చాలా అరుదుగా దర్శనమిస్తారు.

అపరశివావతారం శ్రీ ఆది శంకరచార్యలకు కాశిలొ దర్శనమిచ్చి,వాదించి,వారి జీవితకాలాన్ని 16 నుండి 32 సంవత్సరములకు పెంచిన మహ పురుషుడు.
శక్తిమహర్షి మనుమడు,పరాశర మహర్షి కూమారుడు.
ఘనరూపమైన వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి,వ్యాసంగా ఉన్న వేదాన్ని విభజించాడు కనుక వేదవ్యాసుడని పేరు తెచ్చుకొని,అనేకానేక ఉపనిషత్తులు వ్రాసి,18 మహా పురణాలు,ఉపపురణాలు రచించారు.మహభారత కావ్యాన్ని చెప్తూ వినయకుని చేత వ్రాయించిన మహానుభవుడు.సనాతన హిందూ ధర్మానికి మూలస్తంభాలు అయిన భగవద్గీత,బ్రహ్మ సూత్రాలు,కర్మ సిద్ధాంతం(ప్రస్తానత్రయం)న్ని మనకు అందించిన వారు.

కేవలం హిందూ ధర్మంలొనేగాక బౌద్ధము,సిక్కులకు కూడా పుజ్యనీయుడైన వ్యాసుడు ఒక బెస్త(చేపలు పట్టెవల్లు)స్త్రీకి జన్మించారు.

ఒకనాడు దుర్గమాసురుడనె ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని కొసం కొన్ని వందల సంవత్సరాల తపస్సు చేశాడు.బ్రహ్మ ప్రీతిపొంది ప్రత్యక్షం అయ్యి వరం కోరుకోమనగా వేదాలను అందరు మర్చిపొవాలని,వేద జ్ఞానం అంతా తనకే రావలని వరం అడిగాడు.సరే అన్నాడు బ్రహ్మ ఇల చెయ్యడం మూలంగా దేవతలను ఓడించాలని వాడి ఆలొచన.
అతి తక్కువ కాలంలొనే అందరు వేదాలను మర్చిపొయారు."వేదొఖిలం మూలం జగత్"అని వాక్యం.అంటే వేదమే అన్నిటికి మూలమని.అందువల్ల నాలుగు వర్ణలా వారు వారి వారి పనులు మర్చిపొయారు.వ్యవసాయం చేయ్యట్లేదు,దేశ రక్షణ,వ్యాపరం,పూజాలు,మంత్రాలది కూడా అదే పరిస్థితి.దుర్గమాసుర సైన్యం విజృంబించింది.యగ్నయాగాదులు లేక దేవతలకు హవిస్సు లేదు,తత్ఫలితంగా వర్షాలు కురవడంలేదు.ప్రపంచమంత కరువు సంభవించింది.మృత్యుదేవత విలయతాండవం చేస్తొంది.పశుపక్షాదులు,వృక్ష సంపద నాశనం అవ్వడం పరిపాటే అయ్యింది.దేవతల శక్తి క్షీణించడం జరిగింది.
దుర్గమాసురుడు ఇంద్రపదవిని లాక్కుని,స్వర్గాన్ని ఆక్రమించాడు.ప్రజలబాధను తీర్చలేక క్షత్రియులు రాజ్యాన్ని వదిలేశారు.లొకమంతట హాహాకారలు మిన్నంటాయి.అది చూసిన ఋషులు చలించిపొయారు.ఋషులు,మునులు,తాపసులు,సిద్ధులు అందరు జీవకోటి ఆకలి తీర్చాలని ఉన్న తమకు ఏమి గుర్తురాక బాధపడ్డారు.

చివరకు ఋషులు అందరు "సుమేరు పర్వతం"గుహలలోకి వెళ్ళి ఆ జగన్మాతను "అమ్మా!అమ్మా!" వేడుకున్నారు.వారి పలుకులను ఆ తల్లి విని వారి ఎదుట ప్రత్యక్షం అయ్యింది.నీలివర్ణంతొ అనేకమైన కళ్ళతో "శతాక్షి"అనే నామంతొ చతుర్భుజములుతొ కనిపించింది.ధనుర్బణాలతొ ఉన్న ఆ తల్లి ఈ దుర్గతిని చూసి 9 రోజులపాటు కన్నుల నీరు కారుస్తూ ఏడ్వసాగింది.ఆమె కన్నిటితొ ఈ అన్ని నదులు నిండిపొయాయి.ఇక వారి దుస్థితిని చూడలేక అమ్మె శాకంబరిగా అవతరించింది.అమ్మ శరీరభాగాలుగా కూరలను,పండ్లను,గింజలను,గడ్డి మొదలైనవి ఉండగా,తన శరీరభాగలను(శాకములను) అన్ని జీవాలకు ఇచ్చింది.ఋషులు,మునులు,దేవతలు వేదాలను దుర్గమాసురుని దగ్గర్నుండి విడిపించమని వేడుకొన్నారు.ఆమె సరే అన్నది.

ఇంకా చదవండి »

ఆగమములు

ఆగమములనగా వచ్చి చేరుట అని  అర్థం.  వీటిని  శివుడు  మొదటగా  పార్వతీదేవికి ఉపదేశించుట జరిగినది. ఇవి వేదాలతో బాటు  ప్రాచీనమైనవి.  వీటిని ఆవిర్భూతాలని అంటారు. ఆగమములు వైదికము, తాంత్రికము అని కలవు. శైవాగమములు వైదిక ఆగమములుగా చెప్పబడతాయి. ఎంతో విశేషత కలిగిన ఈ ఆగమములలో వీరశైవము - సిద్దాంతము - దీక్ష - ఆచరణ గూర్చి  విశేషంగా కలదు. అంతేగాక ఈ ఆగమ సిద్దాంతాల ఆధారంగానే వీరశైవపు పెక్కు గ్రంధాలు వెలువరించబడినవి.

ఆగమాల ప్రస్తావన పెక్కు పురాణాలలో కనిపిస్తుంది. అంతేగాక శ్వేతాశ్వరాది ఉపనిషత్తులలోని శ్లోకాలు విషయమూ ఆగమములలో కూడా కలవు. భగవద్గీతలోని చాలా శ్లోకాలు ఆగమములోనివిగా (ఎక్కువగా  పారమేశ్వరాగామము నుండి) అగుపిస్తాయి.  కొన్ని శ్లోకాలు యథాతతంగానూ మరికొన్ని కొద్ది మార్పులతోనూ కలవు.

ఆగములను ప్రాచీనులైన కాళిదాసాది పండితులు తమ రచనలలో ఆగమ విషయ ప్రస్తావన చేయడం ఇవి చారిత్రకంగానూ బహు పురాతణమని తెలియదగును. 

ప్రాచీన కాలంలో వేదపరంగా ఆచరణాధికాలు ఉండేవి, కాని ప్రస్తుతం హిందూమతం యావత్తు ఈ ఆగమ శాస్త్రం ప్రకారమే నడుస్తుందని చెప్పవచ్చు. మనం నిత్యం ఆచరించే పద్దతులు, పూజా విధానాలు, దేవాలయాలు - వాటి పూజాధికాలు, పండుగలు ఇత్యాది ఎన్నో ఆగమ యుతంగా నడుస్తున్నాయి.

వేదములు కర్మను ప్రధానంగా భోదిస్తాయి, ఉపనిషత్తులు జ్ఞాన బోధకములు, కాగా ఆగమములు కర్మజ్ఞాన సముచ్చయక భోదములు.  కేవల తత్వ జ్ఞానమునే కాక ఉపాసనాధి క్రియల తెలిపి జీవులకు ముక్తిని ప్రసాదించు నట్టివి - కావున అందరికీ ఆచరనీయమైనవి.

ఆగమ శబ్దార్థం  
Aagatha Shiva Vaktrebhyah, Gathasthu Girijaa Mukham  ! 
Maheshwara Thathva Kathaanaadaagamah Kathitho Dvija !! (Kaaranagama)
పరమశివుని పంచ ముఖముల నుండి వెలువడి పార్వతి మరియు బ్రహ్మాదులచే గ్రహించబడినవి. ఇవి పరమేశ్వరుని పరతత్వ భోధకములు. 

ఆగమాస్ - వైదికం  
"Shivaagama Midam Punyam Shruthimoolam Vimukthidame
Tasmath Sadaa Sevaneeyam" (Kaamikaagamam)
శివాగామములు పుణ్యమైనవి వేద మూలకములు. ఇవి ముక్తిదాయకములైనందున వీటిని సదా సేవించవలయును. 

ఆగమం అనగా ?  
Aachaara KathanaathDivyagathi Praapthi Vidhaanathahv !
Mahesha Thathva KathanaathAagamah Kathithah Priye !! (Kiranaagama)
ఆగమములలో శైవాచారాలు, శివదీక్షాది విధులు, మోక్ష సాధకములైన శివలింగాది పూజాధికాలు, మహేశ్వర తత్వ ప్రతిపాదకుమలైన విషయములు ఉండును.  

 ఆగమ శాస్త్రములు 2 విధాలు:
1) శైవాగమాలు 2) శాక్తేయ ఆగమాలు (శాక్తేయ ఆగమాలను  తంత్ర ఆగమాలు అని కూడా అంటారు ) 
వీటిలో  దేవతామూర్తుల నిర్మాణం, దేవాలయాల నిర్మాణం, విగ్రహ ప్రతిష్టలు, పూజోపాసనాది క్రియలతో కూడుకొని ఉండును. 

శాక్తేయ (తంత్ర) ఆగమాలు 64 కలవు, వీటిలో శాక్త పద్దతుల సిద్దాంతాల గూర్చి వివరంగా తెలుపబడి ఉండును.  ఇవి పరాశాక్తియైన  పార్వతికి  సంబందించినవి.


శైవ అగమాస్ 
శైవాగమాలు 28 కలవు. ఈ 28 ఆగమాలను అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత పరంగా కూడా విభాగించ బడ్డవి.

ప్రతి శైవాగామములో దిగువ విషయాలు ప్రతిపాదింపబడి ఉంటాయి :
క్రియాపాద, చర్యపాద, యోగపాద, జ్ఞానపాద అనే నాలుగు పాదములు
పతి, కుండలిని, మాయ, పశు, పాశ, దీక్ష అనే షట్పదార్థములు తెలియజేయబడి ఉండును. . 

గురుముఖమున నిర్గతమగుజ్ఞానము, ప్రత్యక్షాది పదార్థరూప జ్ఞేయము, లింగార్చనా లక్షణమగు అనుష్టేయము, భస్మధారణాత్మకమగు అధికృతము, శివమంత్ర రూపమగు సాధనము, శివ సమానతా ముక్తి రూపమగు సాధ్యము అనే షట్పదార్థములు తెలియజేయబడి ఉండును. 

శివుని సగుణ, నిర్గుణ ఉపాసనల వివరించునవే శైవాగమములు.   ఇవి పూర్తిగా శైవ సిద్దాంతాలను, పద్దతులను, దీక్షాది విధులను, ఆలయ నిర్మాణ, నిర్వాహణాది విషయాలను     భొదించును. ఇవి సమస్త శైవులందరికీ ప్రధానమైనవి. పార్వతీదేవి సందేహాల నివృత్తి చేస్తూ శివునిచే భోదించబడెను.  ఈ ఆగమాలను వేరు వేరు మహాత్ములు విని ప్రచారము చేశారు.


సద్యోజాత ముఖమున - 5
వామదేవ ముఖమున - 5
అఘోర ముఖమున - 5
తత్పురుష ముఖమున - 5

ఈశాన ముఖమున - 8

ఇంకా చదవండి »